TypeScript ని ఉపయోగించడం
TypeScript అనేది JavaScript కోడ్బేస్లకు టైప్ డెఫినిషన్లను జోడించడానికి ఒక ప్రసిద్ధ మార్గం. TypeScript JSX ని సపోర్ట్ చేస్తుంది మరియు మీరు మీ ప్రాజెక్ట్‌కి @types/react
మరియు @types/react-dom
ను చేర్చడం ద్వారా పూర్తి React Web సపోర్ట్‌ని పొందవచ్చు.
You will learn
ఇన్స్టాలేషన్
అన్ని production-grade React frameworks TypeScript ఉపయోగాన్ని సపోర్ట్ చేస్తాయి. ఇన్స్టాలేషన్ కోసం ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేక గైడ్‌ను అనుసరించండి:
ఉన్న React ప్రాజెక్ట్‌కు TypeScript ను చేర్చడం
React యొక్క type నిర్వచనాల తాజా వెర్షన్ ఇన్స్టాల్ చేయడానికి:
మీ tsconfig.json
లో, క్రింది compiler ఆప్షన్స్ సెట్ చేయాలి:
lib
లోdom
ఉండాలి (గమనిక: ఎలాంటిlib
ఆప్షన్ పేర్కొనబడలేదు అంటే,dom
డిఫాల్ట్ గా ఉంటుంది).jsx
ని సరైన ఆప్షన్లలో ఒకదానిపై సెట్ చేయాలి. చాలా అప్లికేషన్స్‌కిpreserve
సరిపోతుంది. మీరు లైబ్రరీని publish చేస్తున్నట్లు అయితే, ఎలాంటి విలువను ఎంచుకోవాలోjsx
డాక్యుమెంటేషన్ ను సంప్రదించండి.
React Components తో TypeScript
React తో TypeScript వ్రాయడం, React తో JavaScript వ్రాయడముతో చాలా సమానం. ఒక కాంపోనెంట్‌తో పని చేస్తున్నప్పుడు ముఖ్యమైన తేడా మీరు మీ కాంపోనెంట్ యొక్క props కోసం types అందించవచ్చు. ఈ types సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి మరియు editor లో inline documentation అందించడానికి ఉపయోగించవచ్చు.
Quick Start గైడ్ నుండి MyButton
కాంపోనెంట్ తీసుకుని, బటన్ కోసం title
ను వివరిస్తున్న type ని జోడించవచ్చు:
function MyButton({ title }: { title: string }) { return ( {title} ); } export default function MyApp() { return (

Welcome to my app
<MyButton title="I'm a button" />

ఈ inline syntax ఒక కాంపోనెంట్‌కు types అందించడానికి అత్యంత సులభమైన మార్గం, కానీ మీరు కొన్ని ఫీల్డ్స్‌ను వివరిస్తూ ప్రారంభించినప్పుడు ఇది గందరగోళంగా మారవచ్చు. దీనికి బదులుగా, మీరు కాంపోనెంట్ యొక్క props ను వివరిచేందుకు interface
లేదా type
ఉపయోగించవచ్చు:
interface MyButtonProps { /** The text to display inside the button */ title: string; /** Whether the button can be interacted with */ disabled: boolean; } function MyButton({ title, disabled }: MyButtonProps) { return ( {title} ); } export default function MyApp() { return (

Welcome to my app
<MyButton title="I'm a disabled button" disabled={true}/>

మీ కాంపోనెంట్ యొక్క props ను వివరిస్తున్న type అవసరమున్నంత సులభంగా లేదా క్లిష్టంగా ఉండవచ్చు, కానీ అవి type
లేదా interface
తో వివరిస్తే ఒక object type గా ఉండాలి. TypeScript objects ను ఎలా వివరిస్తుందో మీరు Object Types లో నేర్చుకోవచ్చు కానీ మీరు Union Types ను కూడా props వివరిస్తూ ఉపయోగించడం గురించి ఆసక్తి చూపవచ్చు, ఇది కొన్ని విభిన్న type లలో ఒకటి కావచ్చు మరియు మరింత ఆధునిక ఉపయోగకేసులకు Creating Types from Types గైడ్ ఉపయోగపడుతుంది.
ఉదాహరణ Hooks
@types/react
నుండి type నిర్వచనలు బిల్ట్-ఇన్ Hooks కోసం types కలిగి ఉంటాయి, కాబట్టి మీరు వాటిని మీ కంపోనెంట్లలో ఎలాంటి అదనపు సెటప్ లేకుండా ఉపయోగించవచ్చు. అవి మీ కంపోనెంట్ లో మీరు వ్రాసే కోడ్ ను పరిగణనలోకి తీసుకుంటాయి, కాబట్టి చాలా సార్లు మీరు inferred types పొందుతారు మరియు సాధారణంగా types ను ఇవ్వడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొనవలసిన అవసరం లేదు.
అయితే, హుక్స్ కోసం types ను అందించే కొన్ని ఉదాహరణలను చూడవచ్చు.
useState
useState
Hook initial state గా ఇవ్వబడిన value ను తిరిగి ఉపయోగించి ఆ value యొక్క type ఏమిటి అని నిర్ధారిస్తుంది. ఉదాహరణకు:
// Infer the type as "boolean"
const [enabled, setEnabled] = useState(false);
ఇది enabled
కు boolean
type ను కేటాయిస్తుంది, మరియు setEnabled
boolean
argument ను లేదా boolean
ను రిటర్న్ చేసే function ను స్వీకరించే function అవుతుంది. మీరు state కోసం type ను స్పష్టంగా ఇవ్వాలనుకుంటే, మీరు useState
కాల్ కు type argument ను ఇవ్వవచ్చు:
// Explicitly set the type to "boolean"
const [enabled, setEnabled] = useState<boolean>(false);
ఇది ఈ సందర్భంలో అంతగా ఉపయోగకరమైనది కాదు, కానీ మీరు type ను ఇవ్వాలనుకునే సాధారణ సందర్భం యూనియన్ type ఉన్నప్పుడు. ఉదాహరణకు, status
ఇక్కడ కొన్ని వేర్వేరు strings లో ఒకటి కావచ్చు:
type Status = "idle" | "loading" | "success" | "error";
const [status, setStatus] = useState<Status>("idle");
లేదా, Principles for structuring state లో సిఫారసు చేసినట్లు, మీరు సంబంధిత state ను ఒక object గా కలిపి, వేర్వేరు అవకాశాలను object types ద్వారా వివరించవచ్చు:
type RequestState =
| { status: 'idle' }
| { status: 'loading' }
| { status: 'success', data: any }
| { status: 'error', error: Error };
const [requestState, setRequestState] = useState<RequestState>({ status: 'idle' });
useReducer
useReducer
Hook ఒక కాంప్లెక్స్ Hook, ఇది ఒక reducer function మరియు ఒక initial state ను తీసుకుంటుంది. reducer function కోసం types initial state నుండి అంచనా వేయబడతాయి. మీరు useReducer
కాల్ కు type argument ను ఇస్తూ state కోసం type అందించవచ్చు, కానీ initial state పై type సెట్ చేయడం మంచిది:
import {useReducer} from 'react'; interface State { count: number }; type CounterAction = | { type: "reset" } | { type: "setCount"; value: State["count"] } const initialState: State = { count: 0 }; function stateReducer(state: State, action: CounterAction): State { switch (action.type) { case "reset": return initialState; case "setCount": return { ...state, count: action.value }; default: throw new Error("Unknown action"); } } export default function App() { const [state, dispatch] = useReducer(stateReducer, initialState); const addFive = () => dispatch({ type: "setCount", value: state.count + 5 }); const reset = () => dispatch({ type: "reset" }); return (

Welcome to my counter

Count: {state.count}
Add 5 Reset

మేము TypeScript ను కొన్ని కీలక ప్రదేశాలలో ఉపయోగిస్తున్నాము:
interface State
reducer యొక్క state యొక్క ఆకారాన్ని వర్ణిస్తుంది.type CounterAction
reducer కు పంపవచ్చే వేర్వేరు actions ను వర్ణిస్తుంది.const initialState: State
initial state కు type ను అందిస్తుంది, మరియు అదే typeuseReducer
ద్వారా డిఫాల్ట్ గా ఉపయోగించబడుతుంది.stateReducer(state: State, action: CounterAction): State
reducer function యొక్క arguments మరియు return value కు types ను సెట్ చేస్తుంది.
initialState
పై type సెట్ చేయడానికి మరింత స్పష్టమైన ప్రత్యామ్నాయం useReducer
కు type argument ను అందించడం:
import { stateReducer, State } from './your-reducer-implementation';
const initialState = { count: 0 };
export default function App() {
const [state, dispatch] = useReducer<State>(stateReducer, initialState);

useContext
useContext
Hook props ను components ద్వారా పంపకుండా, డేటా ను component tree లోకి పంపించడానికి ఒక పద్ధతి. ఇది ఒక provider component ను సృష్టించడం ద్వారా ఉపయోగించబడుతుంది మరియు తరచుగా ఒక Hook ను సృష్టించడం ద్వారా చైల్డ్ component లో value ను వినియోగించడానికి ఉపయోగించబడుతుంది.
context ద్వారా అందించబడిన value యొక్క type, createContext
కాల్ కు పంపబడిన value నుండి అంచనా వేయబడుతుంది:
import { createContext, useContext, useState } from 'react'; type Theme = "light" | "dark" | "system"; const ThemeContext = createContext<Theme>("system"); const useGetTheme = () => useContext(ThemeContext); export default function MyApp() { const [theme, setTheme] = useState<Theme>('light'); return ( <ThemeContext.Provider value={theme}> <MyComponent /> </ThemeContext.Provider> ) } function MyComponent() { const theme = useGetTheme(); return (

Current theme: {theme}

ఈ పద్ధతి మీకు అర్థం చేసే డిఫాల్ట్ value ఉన్నప్పుడు పనిచేస్తుంది - కానీ అప్పుడప్పుడు మీరు డిఫాల్ట్ value లేని సందర్భాలు ఉంటాయి, మరియు ఆ సందర్భాలలో null
ఒక డిఫాల్ట్ value గా సరైనదిగా భావించవచ్చు. అయితే, type-system మీ కోడ్‌ను అర్థం చేసుకునేలా చేయడానికి, మీరు createContext
లో ContextShape | null
ను స్పష్టంగా సెట్ చేయాలి.
ఇది | null
ను context వినియోగదారుల type లో నుండి తొలగించాల్సిన సమస్యను కలిగిస్తుంది. మా సిఫారసు ఏమిటంటే, Hook ఒక రన్‌టైమ్ చెక్ చేసి, అది లేకపోతే ఒక తప్పును చూపిస్తుంది:
import { createContext, useContext, useState, useMemo } from 'react';
// This is a simpler example, but you can imagine a more complex object here
type ComplexObject = {
kind: string

// The context is created with `| null` in the type, to accurately reflect the default value.
const Context = createContext<ComplexObject | null>(null);
// The `| null` will be removed via the check in the Hook.
const useGetComplexObject = () => {
const object = useContext(Context);
if (!object) { throw new Error("useGetComplexObject must be used within a Provider") }
return object;

export default function MyApp() {
const object = useMemo(() => ({ kind: "complex" }), []);
return (
<Context.Provider value={object}>
<MyComponent />
</Context.Provider>

function MyComponent() {
const object = useGetComplexObject();
return (

Current object: {object.kind}

useMemo
useMemo
Hook ఒక function కాల్ నుండి ఒక మేమోరైజ్డ్ value ను సృష్టిస్తుంది/తిరిగి యాక్సెస్ చేస్తుంది, dependencies (2వ పరామితి) మారినప్పుడు మాత్రమే function ను మళ్ళీ నడుపుతుంది. Hook ను కాల్ చేయడం వలన వచ్చిన ఫలితం మొదటి పరామితిలోని function నుండి తిరిగి వచ్చిన value నుండి అంచనా వేయబడుతుంది. మీరు type argument ను Hook కు అందించడం ద్వారా మరింత స్పష్టంగా చేయవచ్చు.
// The type of visibleTodos is inferred from the return value of filterTodos
const visibleTodos = useMemo(() => filterTodos(todos, tab), [todos, tab]);
useCallback
useCallback
ఒక function కు dependencies మారకుండా ఉంటే స్థిరమైన రిఫరెన్స్ ను అందిస్తుంది. useMemo
లాగా, function యొక్క type మొదటి పరామితిలోని function యొక్క return value నుండి అంచనా వేయబడుతుంది, మరియు మీరు type argument ను Hook కు అందించడం ద్వారా మరింత స్పష్టంగా చేయవచ్చు.
const handleClick = useCallback(() => {

}, [todos]);
TypeScript strict mode లో పని చేస్తున్నప్పుడు useCallback
లో మీ callback లోని parameters కు types ను చేర్చాలి. ఇది callback యొక్క type function యొక్క return value నుండి అంచనా వేయబడుతుంది, మరియు parameters లేకుండా type పూర్తిగా అర్థం కాలేదు.
మీ కోడ్-స్టైల్ ప్రాధాన్యతలపై ఆధారపడి, callback ను నిర్వచించే సమయంలో event handler కోసం type ను అందించడానికి React types నుండి *EventHandler
functions ను ఉపయోగించవచ్చు:
import { useState, useCallback } from 'react';
export default function Form() {
const [value, setValue] = useState("Change me");
const handleChange = useCallback<React.ChangeEventHandler<HTMLInputElement>>((event) => {
setValue(event.currentTarget.value);
}, [setValue])
return (

Value: {value}

ఉపయోగకరమైన Types
@types/react
ప్యాకేజ్ నుండి చాలా విస్తృతమైన types సెట్ వస్తుంది, React మరియు TypeScript ఎలా పరస్పర చర్యలో ఉంటాయో మీరు సౌకర్యంగా భావించినప్పుడు ఇది చదవడం విలువైనది. మీరు వాటిని DefinitelyTyped లో React యొక్క ఫోల్డర్ లో కనుగొనవచ్చు. ఇక్కడ మేము కొన్ని సాధారణంగా ఉపయోగించే types ను కవర్ చేస్తాము.
DOM ఈవెంట్స్
React లో DOM ఈవెంట్స్ తో పని చేస్తున్నప్పుడు, ఈవెంట్ యొక్క type ఈవెంట్ హ్యాండ్లర్ నుండి తరచుగా అంచనా వేయబడుతుంది. అయితే, ఒక function ను ఈవెంట్ హ్యాండ్లర్ కు పంపించడానికి extraction చేయాలనుకుంటే, మీరు ఈవెంట్ యొక్క type ను స్పష్టంగా సెట్ చేయాలి.
import { useState } from 'react'; export default function Form() { const [value, setValue] = useState("Change me"); function handleChange(event: React.ChangeEvent<HTMLInputElement>) { setValue(event.currentTarget.value); } return ( <>
Value: {value}

React types లో చాలా రకాల ఈవెంట్స్ అందుబాటులో ఉన్నాయి - పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు, ఇది DOM నుండి ప్రసిద్ధమైన ఈవెంట్స్ పై ఆధారపడి ఉంటుంది.
మీరు అవసరమైన type ను నిర్ణయిస్తున్నప్పుడు, మీరు ఉపయోగిస్తున్న ఈవెంట్ హ్యాండ్లర్ కోసం హోవర్ సమాచారాన్ని మొదట చూడవచ్చు, ఇది ఈవెంట్ యొక్క type ను చూపిస్తుంది.
ఈ జాబితాలో లేని ఈవెంట్ ను ఉపయోగించాల్సి వస్తే, మీరు React.SyntheticEvent
type ను ఉపయోగించవచ్చు, ఇది అన్ని ఈవెంట్స్ కోసం బేస్ type.
Children
ఒక కంపోనెంట్ యొక్క children ను వివరించడానికి రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి. మొదటిది React.ReactNode
type ను ఉపయోగించడం, ఇది JSX లో children గా పంపబడగల అన్ని సంభావ్య type ల యొక్క యూనియన్:
interface ModalRendererProps {
title: string;
children: React.ReactNode;

ఇది children యొక్క విస్తృత నిర్వచనం. రెండవది React.ReactElement
type ను ఉపయోగించడం, ఇది కేవలం JSX elements మాత్రమే, JavaScript primitives వంటి strings లేదా numbers కాదు:
interface ModalRendererProps {
title: string;
children: React.ReactElement;

గమనించండి, మీరు TypeScript ను children ఒక నిర్దిష్ట రకం JSX elements అని వివరించడానికి ఉపయోగించలేరు, కాబట్టి కేవలం

children మాత్రమే అంగీకరించే ఒక కంపోనెంట్ ను type-system ద్వారా వివరించలేరు.
React.ReactNode
మరియు React.ReactElement
రెండింటి ఉదాహరణను type-checker తో సహా ఈ TypeScript playground లో చూడవచ్చు.
Style Props
React లో inline styles ఉపయోగిస్తున్నప్పుడు, style
prop కు పంపబడే object ను వర్ణించడానికి మీరు React.CSSProperties
ను ఉపయోగించవచ్చు. ఈ type అన్ని సంభావ్య CSS properties యొక్క యూనియన్, మరియు ఇది మీరు style
prop కు సరైన CSS properties పంపిస్తున్నారని నిర్ధారించడానికి మరియు మీ ఎడిటర్ లో auto-complete పొందడానికి మంచి మార్గం.
interface MyComponentProps {
style: React.CSSProperties;

మరింత నేర్చుకోవడానికి
ఈ గైడ్ React తో TypeScript ఉపయోగించడం గురించి ప్రాథమికాలను కవర్ చేసింది, కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది. Docs లోని వ్యక్తిగత API పేజీలు TypeScript తో వాటిని ఎలా ఉపయోగించాలో గురించి మరింత లోతైన డాక్యుమెంటేషన్ కలిగి ఉండవచ్చు.
మేము ఈ కింది వనరులను సిఫారసు చేస్తున్నాము:

The TypeScript handbook TypeScript కోసం అధికారిక డాక్యుమెంటేషన్, మరియు అధిక భాగం కీలక భాషా లక్షణాలను కవర్ చేస్తుంది.

The TypeScript release notes కొత్త లక్షణాలను లోతుగా కవర్ చేస్తాయి.

React TypeScript Cheatsheet TypeScript తో React ఉపయోగించడానికి కమ్యూనిటీ-నిర్వహిత చీట్ షీట్, చాలా ఉపయోగకరమైన ఎడ్జ్ కేసులను కవర్ చేస్తూ ఈ డాక్యుమెంట్ కంటే మరింత విస్తృతతనాన్ని అందిస్తుంది.

TypeScript Community Discord TypeScript మరియు React సమస్యలతో సహాయం కోసం ప్రశ్నలు అడగడానికి మరియు సహాయం పొందడానికి గొప్ప ప్రదేశం.